ETV Bharat / snippets

హైదరాబాద్‌కు జానీ మాస్టర్ - రహస్య ప్రదేశంలో పోలీసుల విచారణ

author img

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

Jani Master Arrest
Jani Master Case Update (ETV Bharat)

Jani Master Case Update : అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన ప్రముఖ డ్యాన్స్​ మాస్టర్​ జానీ అలియాస్‌ షేక్‌ జానీ బాషాను పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో అతడిని విచారిస్తున్నారు. గోవాలో అరెస్ట్‌ చేసిన జానీ మాస్టర్‌ను ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ తరవాత ఉప్పరపల్లి కోర్టుల్లో ఆయన్ను హాజరుపరచనున్నారు. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.