ETV Bharat / snippets

ఫేస్​బుక్​లో పరిచయం - పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం - ఆపై ఏం జరిగిందంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 9:20 PM IST

Rape Accused Arrest
Hyderabad Police Arrest to Cheating Lover (ETV Bharat)

Hyderabad Police Arrest to Cheating Lover : ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జనగామకు చెందిన స్వామి అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నట్లు మహంకాళి ఇన్​స్పెక్టర్​ పరుశురాం తెలిపారు. ఛత్తీస్​గఢ్​కు చెందిన యువతితో ఫేస్​బుక్​లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్లో కలుసుకున్నారు. హోటల్లో యువతిపై స్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

యువతిపై అత్యాచారం చేసిన అనంతరం పెళ్లి ప్రస్తావని తీసుకురాగా, తీరా పెళ్లికి నిరాకరించిన స్వామి ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమై విమానాశ్రయానికి చేరుకున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు అందుకున్న మహంకాళి పోలీసులు ఓఆర్ఆర్ పోలీసులతో పాటు శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి స్వామిని ఆస్ట్రేలియాకు వెళ్లకుండా విమానాశ్రయంలోనే ఆపి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడు స్వామిని రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.