ETV Bharat / technology

సొంత AI ప్లాట్​ఫారమ్​ను​ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్​- గూగుల్, శాంసంగ్​కు పోటీగా అదిరే ఫీచర్స్..! - INFINIX AI LAUNCHED GLOBALLY

Infinix AI Launched Globally: గూగుల్, శాంసంగ్ తమ AI ప్లాట్‌ఫారమ్స్​ను లాంచ్ చేయగా.. ఇప్పుడు ఇన్ఫినిక్స్ కూడా తన AI ప్లాట్‌ఫారమ్ 'ఇన్ఫినిక్స్ ఏఐ'ని ప్రారంభించింది.

Infinix AI Launched Globally
Infinix AI Launched Globally (Infinix Mobile)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 8, 2024, 5:01 PM IST

Infinix AI Launched Globally: ఇటీవల గూగుల్​ తన జెమిని ఏఐ, శాంసంగ్ తన గెలాక్సీ ఏఐ ప్లాట్​ఫారమ్స్​ను ప్రారంభించాయి. వీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో ఇన్ఫినిక్స్​ కూడా తన సొంత ఏఐ ప్లాట్​ఫారమ్​ను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాట్​ఫారమ్​ అధునాతన టెక్నాలజీ ద్వారా యూజర్స్​కు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇన్ఫినిక్స్ ఏఐ: ఇన్ఫినిక్స్ ఏఐలో Folex ఉంది. ఇది ఇన్ఫినిక్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్​ను GPT-4o, జెమిని వంటి అడ్వాన్స్డ్ ఎక్స్టెర్నల్ మోడల్స్​తో కనెక్ట్ చేసే ఒక వర్చువల్ అసిస్టెంట్. ఈ ఇంటిగ్రేషన్ వినియోగదారులకు రోబస్ట్ అండ్ వర్సిటైల్ అసిస్టెంట్​ను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ ఏఐలోని Folax.. టెక్స్ట్, వాయిస్, ఇమేజ్​తో సహా మల్టిపుల్ ఇన్​పుట్​ టైప్స్​ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఇతర ఏఐ అసిస్టెంట్స్​ల మాదిరిగానే రియల్- టైమ్ ఫీడ్​బ్యాక్, కస్టమైజ్డ్​ రికమండేషన్స్​ను అందిస్తుంది. ఇది యూజర్స్ అవసరాలకు తగినట్లుగా వర్సిటైల్ డివైజ్​గా పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్ ఏఐ కూడా పర్సనల్, బిజినెస్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఫీచర్స్​ను కలిగి ఉంది. వినియోగదారులు ఫొటోలు, డాక్యుమెంట్స్ నుంచి సమాచారాన్ని పొందొచ్చు. లైవ్ టెక్స్ట్​ను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫంక్షనాలిటీ డేటా పునరుద్ధరణను వేగవంతం చేస్తుంది. అవసరమైన సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయాల్సిన స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, రీసెర్చ్ చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ ప్లాట్​ఫారమ్ రైటింగ్ టూల్స్ రియల్ టైమ్​లో గ్రామర్ చెక్స్, కంటెంట్ రీరైటింగ్, స్టైల్ కరెక్షన్స్​ను అందించి టెక్స్ట్​ను ఇంప్రూవ్ చేస్తుంది. క్రియేటివ్ యూజర్స్​ కోసం, మ్యాజిక్ క్రియేటివ్ ఆలోచనలకు జీవం పోయడంలో ఇవి సహాయపడతాయి.

సోషల్ మీడియా పోస్ట్‌లను క్రియేట్ చేయాలనుకున్నా లేదా స్టోరీబోర్డ్‌లను సృష్టించాలన్నా ఈ ఫీచర్ క్రియేటివ్ ప్రాసెస్​కు సపోర్ట్ చేస్తుంది. పర్యాటకులు ఫోటోల నుంచి ల్యాండ్ మార్క్స్​, కల్చరల్ సైట్స్​ గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందడానికి 'విజువల్ లుక్ అప్‌'ని ఉపయోగించొచ్చు. ఈ ఫీచర్ మెరుగైన సమాచారం అందించి మీ ట్రావెల్ ఎస్క్​పీరియన్స్​ను మరింత మెరుగుపరుస్తుంది.

ఇన్ఫినిక్స్ ఏఐ.. మిడిల్ ఈస్ట్, సబ్-సహారా ఆఫ్రికా, యూరప్, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో సాంస్కృతిక సౌందర్యానికి అనుగుణంగా AI వాల్​పేపర్​లను కూడా అందిస్తుంది. యూజర్స్ వారికి నచ్చిన స్టైల్​లో బ్యాక్​గ్రౌండ్స్​ను సెట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.

ఇవేకాక ఏఐ ఎరేజర్, స్మార్ట్ కటౌట్, AI స్కెచ్ వంటి అదనపు టూల్స్​ కూడా ఇందులో ఉన్నాయి. వీటితో హై- క్వాలిటీ విజువల్స్​ను ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్​ కష్టతరమైన పనులను సింపుల్​ చేస్తూ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేచురల్ లాంగ్వెజ్ ప్రశ్నలు, మొబైల్ డేటా, బ్యాలెన్స్ ఎంక్వైరీల కోసం స్మార్ట్ సెర్చ్ వంటి ఫీచర్లతో ఇన్ఫినిక్స్ తన ఏఐ సామర్థ్యాలను విస్తరించాలని యోచిస్తోంది.

పండగ వేళ హీరో మోటోకార్ప్​కు షాక్- రిటైల్ సేల్స్​లో నంబర్​ వన్​గా హోండా

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- త్వరలో మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.