Police Raid on Spa Centers In KPHB : కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు విటులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4లో స్పా సెంటర్ పేరిట క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పక్కా సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకుని కేంద్రాన్ని సీజ్ చేశారు. దీనిని నడపడానికి భవన యజమానికి 2 రెట్ల అద్దె చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు పలుమార్లు దాడులు చేసి అరెస్టు చేసినప్పటికీ కేంద్రాన్ని సీజ్ చేయకపోవడంతో తిరిగి యధావిధిగా కొనసాగించినట్లు తెలుస్తోంది.