ETV Bharat / snippets

రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా - అన్ని విద్యాసంస్థలకు సెలవు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 9:08 PM IST

OU Postponed Exams on Sep 02
OU Postponed Exams on Sep 02 (ETV Bharat)

OU Postponed Exams on Sep 02 : భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం(రేపు) సెలవు ప్రకటించింది. ఓయూ పరిధిలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూ పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. మంగళవారం(ఎల్లుండి) నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ఓయూ పరీక్షల విభాగం పేర్కొంది.

మరోవైపు సోమవారం(రేపు) జరగాల్సిన పరీక్షలను జేఎన్​టీయూ వాయిదా వేసింది. బీటెక్​, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా వేస్తూ జేఎన్​టీయూ ప్రకటన విడుదల చేసింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 5వ తేదీకి మార్చారు.

నిజామాబాద్​ జిల్లాలోని టీయూ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా రేపటి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్​ యాదగిరి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.