Officials Open Pulichintala Project Gates: గత పది రోజుల క్రితం నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. ఏపీలోని కృష్ణా డెల్టాకు నీరందించే ఈ ప్రాజెక్టు గత కొద్ది రోజులుగా జలకళ లేక అడుగున ఉన్న రాళ్లు కనిపించాయి. అయితే ప్రస్తుతం సాగర్ టైల్ పాండ్ నుంచి వరద నీరు వచ్చిచేరడంతో నిండు కుండలా మారింది. ప్రాజెక్లోకి ప్రస్తుతానికి సుమారు 24,637 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 24,637 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. 3 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకి లేపి దిగువకు నీటిని విడుదల చేసారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.6789 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు - సాగర్ నుంచి వస్తున్న వరద
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 7:45 PM IST