ETV Bharat / snippets

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కూల్ టైమింగ్స్​ మారాయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 7:24 PM IST

New School Timings in Telangana 2024
Telangana School Timings Changed (ETV Bharat)

Telangana School Timings Changed : రాష్ట్రంలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక బడుల టైమింగ్స్​కు అనుగుణంగా, ఉన్నత పాఠశాలల సమయాల్లోనూ మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకే సాయంత్రం సైతం 4.45 కు బదులుగా 4.15 గంటలకు పాఠశాలలు పని వేళలు ముగుస్తాయని తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్​లలో ట్రాఫిక్ సమస్యలకు దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్​ను విద్యాశాఖ ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.