ETV Bharat / snippets

త్వరలోనే అంగన్​వాడీల్లో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు : సీతక్క

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 10:05 PM IST

Minister Seethakka Review on Anganwadis
Minister Seethakka Review on Anganwadis (ETV Bharat)

Minister Seethakka Review on Anganwadis : అంగన్​వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం అందించే బాధ్యత అధికారులదేనని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. త్వరలో సీఎం, మంత్రులు అంగన్​వాడీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని సీతక్క తెలిపారు. పూర్వ ప్రాథమిక పాఠాలు బోధించేందుకు అంగన్​వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

మహిళ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ప్రతి నెలా అంగన్​వాడీ టీచర్లతో పాటు ఆయాలకు కూడా శిక్షణ ఇవ్వాలని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులకు కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇస్తే తినడానికి అనువుగా ఉండడంతో పాటు, ఏదైనా నలత ఉన్నట్లు కనిపిస్తే పడేయవచ్చని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.