ETV Bharat / snippets

ములుగును మున్సిపాలిటీగా చేయండి - గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 12:23 PM IST

Mulugu Municipality Bill
Minister Seethakka Meets Governor (ETV Bharat)

Minister Seethakka Meets Governor On Mulugu Municipality Bill : ములుగును మున్సిపాలిటీ చేయాలని మంత్రి సీతక్క గవర్నర్​కు విన్నపించారు. ఈ మేరకు రాజ్​భవన్​లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 2022లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీ చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినా, అది పెండింగ్ పడిపోయిందని మంత్రి తెలిపారు. గవర్నర్ వద్ద పెండింగ్ ఉందనుకుంటే రాష్ట్రపతి స్థాయిలో ఉందని తెలిసిందన్నారు. ములుగును మున్సిపాలిటీ చేసే విధంగా కోరగా, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే గవర్నర్ ములుగు జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకుంటానని చెప్పినట్లు సీతక్క వివరించారు. త్వరలోనే గవర్నర్ ఆదిలాబాద్​తో పాటు నాగర్​కర్నూల్ జిల్లాల పర్యటన చేస్తారని సీతక్క వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.