ETV Bharat / snippets

బీజేపీలో బీఆర్ఎస్​ను విలీనం చేస్తున్నారా - బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందా?: అసదుద్దీన్‌ ఓవైసీ

Asaduddin Owaisi Key Comments
Asaduddin Owaisi Key Comments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 9:54 PM IST

Asaduddin Owaisi Key Comments : బీజేపీ, బీఆర్ఎస్​లు కలిసిపోతాయంటూ గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. బీఆర్ఎస్​ బలహీనపడుతోందన్నారు. దీంతో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2008- 2009లో ఎంఐఎం పార్టీ ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖ రాసినట్లు అసదుద్దీన్‌ పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధిలో వెనకబడి ఉందని పేర్కొన్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని చెప్పామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ కొన్ని లోపాలున్నాయి. ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్​ను విలీనం చేస్తున్నారా.? లేదా బీజేపీకి బీఆర్ఎస్​ మద్దతిస్తుందా.? ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉందని ఓవైసీ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.