Man Committed Suicide After Raping a Girl in Satya sai District : శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఆదివారం రాత్రి దివ్యాంగురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనార్ధన్ అనే యువకుడు ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. నిందితుడు గ్రామస్తుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ రోజు ఉదయం సూసైడ్ నోట్ రాసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
నిందితుడు గతంలో గ్రామ వాలంటీర్‌గా పని చేశాడు. మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. గ్రామస్తుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం బాలికను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.