Telangana Council LOP Madhusudana Chary : శాసనమండలిలో ప్రతిపక్షనేతగా సిరికొండ మధుసూధనాచారి నియమితులయ్యారు. ఎమ్మెల్సీ మధుసూధనాచారిని ప్రతిపక్షనేతగా నియమించాలని భారత రాష్ట్ర సమితి గతంలో కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, శాసనసభాపక్ష నేత కేసీఆర్ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న మండలి ఛైర్మన్, ప్రతిపక్ష నేతగా మధుసూధనాచారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత నియామకం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేతగా మధుసూధనాచారి
Published : Sep 11, 2024, 10:07 PM IST