ETV Bharat / snippets

ఏపీలో భారీగా పెట్టుబడులు- ఎక్స్ వేదికగా లులు గ్రూప్

Lulu Group Chairman
Lulu Group Chairman (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 7:39 PM IST

Lulu Group Chairman Yusuff Ali Tweet: వైఎస్సార్సీపీ సర్కార్ కక్ష సాధింపులతో విశాఖ నుంచి వెళ్లిపోయిన లులు గ్రూప్, కూటమి ప్రభుత్వ సానుకూల ధోరణితో మళ్లీ ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడుల ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించింది. విశాఖలో 8 స్క్రీన్లతో కూడిన ఐమాక్స్ మల్టీప్లెక్స్​తో పాటు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ పెడుతున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసఫ్ అలీ ప్రకటించారు.

విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ అత్యాధునిక హైపర్ మార్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. శనివారం చంద్రబాబుతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు యూసఫ్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చర్చల వివరాలను పంచుకున్నారు. లులు బృందానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నుంచి సాదర స్వాగతం లభించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో 18 ఏళ్లు సుదీర్ఘ అనుబంధం ఉందని అలీ గుర్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.