ETV Bharat / snippets

రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టుకున్న కుటుంబాలే ఎక్కువ : కేటీఆర్

KTR on Rythu Runa Mafi in Telangana at
KTR on Rythu Runa Mafi in Telangana t (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 10:18 AM IST

KTR on Rythu Runa Mafi in Telangana : రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. రుణమాఫీ పథకానికి అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రైతులందరికి రుణమాఫీ కాలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు సీజన్లు అయినా రైతు భరోసా షురూ చేయలేదని విమర్శించారు. జూన్​లో వేయాల్సిన రైతుల భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేల హామీ ఇంకా అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే మొండి చెయ్యి అని, అది మరోసారి రుజువైందని అని వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.