Khairatabad Ganesh 2024 : భాగ్యనగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. హైదరాబాద్ వాసులకు గణపతి అనగానే ఖైరతాబాద్ బడా గణేశ్ గుర్తుకొస్తారు. ఈ వినాయకుడిని చూడడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. అయితే.. మీరు ఈరోజు ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం వెళ్తుంటే.. ఈ విషయం తెలుసుకోండి. అదేంటంటే.. శనివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి గణేశుడిని దర్శించుకొని మొదటి పూజలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాలవైపు దారి మళ్లించారు. అదేవిధంగా.. వీకెండ్ టైమ్ కాబట్టి ఈ రెండు రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే మంచిది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసా?
Published : Sep 7, 2024, 1:44 PM IST