ETV Bharat / snippets

మానసిక ఒత్తిడితో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 8:09 PM IST

STUDENT SUICIDE IN JANGAON DISTRICT
KGBV Student Commits Suicide (ETV Bharat)

KGBV Student Commits Suicide : మానసిక ఒత్తిడితో కేజీబీవీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్పూర్ మండలంలోని రాజవరం శివారు ఫకీర్ తండాకు చెందిన ఇస్లావత్ కిషన్, పిరమ్మల కూతురు వర్షిణి(14), ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో విద్యనభ్యసించింది.

పైతరగతుల కోసం విద్యార్థిని తల్లిదండ్రులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈనెల 21న చేర్పించారు. ఘన్‌పూర్ పాఠశాల వాతావరణానికి అలవాటు పడిన వర్షిణి, కేజీబీవీలో ఉండలేకపోయింది. మానసిక ఒత్తిడితో శనివారం రోజు పాఠశాలలో గుర్తుతెలియని పురుగుల మందు తెచ్చుకొని తాగి, అపస్మారక స్థితికి చేరుకుంది. అది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని ఆదివారం మృతి చెందింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.