ETV Bharat / snippets

కడపలో బాలుడిపై ఎస్​ఐ దాష్టీకం - వీఆర్​కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు

Kadapa SI Madhusudhan Reddy Issue
Kadapa SI Madhusudhan Reddy Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 12:24 PM IST

Kadapa SI Madhusudhan Reddy Issue : కడపలో బాలుడిని కొట్టిన ఘటనలో ఒకటో పట్టణ ఎస్​ఐ మధుసూదన్​రెడ్డిపై ఎస్పీ హర్షవర్ధన్​రాజు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆయణ్ని వీఆర్​కు బదిలీ చేశారు. ఈనెల 20న ఓ మైనర్​ బాలుడు రాజీవ్​పార్క్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎస్​ఐ మధుసూధన్​రెడ్డి వాహనాన్ని ఆపాడు. అతని వద్ద వాహనానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఎస్​ఐ కోపంతో ఊగిపోయాడు.

Kadapa SI Madhusudan Reddy Attack a Minor Boy : ఈ క్రమంలోనే​ బాలుడిని మధుసూధన్​రెడ్డి చితకబాదాడు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎస్​ఐని సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మధుసూదన్​రెడ్డిని వీఆర్​కు పంపుతూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.