ETV Bharat / snippets

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కెేకే నియామకం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 2:04 PM IST

K Keshava Rao
K Keshava Rao (ETV Bharat)

K Keshava Rao Appointed As Telangana Government Advisor : ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కేకేను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్ హోదాతో కేకేను సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేకే ఇటీవల దిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం కేకే రాజీనామా చేశారు. కాగా కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సైతం బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.