ETV Bharat / snippets

తెలంగాణకు రెయిన్​ అలర్ట్ - మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

IMD Weather Report in Telangana
IMD Weather Report in Telangana (ETV Bharat)

IMD Weather Report in Telangana : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనం ఒకటి పశ్చిమ-మధ్య పరిసర నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ నెల 21న ఉత్తర అండమాన్​ సముద్రం పరిసర ప్రాంతాలలో చక్రవాతపు ఆవర్తనం ఒకటి ఎగువ గాలులలో ఏర్పడి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య దాని పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.