IIIT Student Suicide in Kurnool : కర్నూలులోని ట్రిపుల్ ఐటీ (డీఎం) (Design & Manufacturing) క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్ నాయుడు మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈరోజు (శనివారం) మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలు బయటికి రాకుండా ఇద్దరు అధ్యాపకులు ప్రయత్నించినట్టు సమాచారం. ఘటనా స్థలిని వెంటనే శుభ్రం చేయడంతో విద్యార్థులు అధ్యాపకుల తీరుపై మండిపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య - అసలు కారణం ఇదే!
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 8:20 PM IST
|Updated : Jul 27, 2024, 8:53 PM IST