Himayat Sagar and Osman Sagar Gates Lifted : ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ 1763.50 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా, 1763.40 అడుగులకు చేరుకుంది. అలాగే ఉస్మాన్‌సాగర్ 1790 అడుగుల పూర్తి స్థాయికి నిండింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఉస్మాన్‌సాగర్ 2 గేట్లు ఎత్తి 234 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అలాగే హిమాయత్ సాగర్‌కు సంబంధించి ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. రెండు రిజర్వాయర్ల నుంచి మూసీలోకి నీరు వదలడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.