Hyderabad CP on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావుల పైనా రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరామని సీపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను దేశానికి తీసుకొస్తామని ఆయన వివరించారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్న వారిని విచారిస్తామని తెలియజేశారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్‌పై త్వరలో రెడ్‌కార్నర్ నోటీస్ : హైదరాబాద్ సీపీ
Published : Aug 24, 2024, 7:14 PM IST