High Court On Kanthi Rana Tata Bail Petition: ముంబయి సినీనటి కేసులో ఐపీఎస్లు, ఏసీపీ, సీఐ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గురువారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించనున్నారు. ముంబయి సినీ నటి కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు ఇదే కేసులో తన రిమాండ్ రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ వేసిన పిటిషన్‌పై సైతం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
ముంబయి నటి కేసు - ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 10:09 PM IST