High Court Hear Petition of Bode Ramachandra Yadav : వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచినందుకు చిత్తూరు జిల్లా పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై.. బోడె రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు పుంగనూరు ఎమ్మెల్యేతో పాటు ఆ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల పిటిషన్లో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు అభ్యర్థులకు ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 10:40 PM IST