BRS MLC Kavitha's Default Bail Petition Adjourned : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కవితకు వ్యతిరేకంగా గతంలో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, అందులో తప్పులున్నాయంటూ కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీబీఐ ఛార్జ్‌షీట్‌ను రీఫైలింగ్ చేయగా, అందులోనూ తప్పులున్నాయని చెప్పారు. ఈ మేరకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
బెయిల్ కోరుతూ తెలంగాణ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ పిటిషన్ - కౌంటర్ దాఖలుకు సీబీఐకి కోర్టు ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:30 PM IST