అనకాపల్లిలో పేలుడు కలకలం - ముగ్గురికి తీవ్రగాయాలు - FIRE ACCIDENT AT Cement Bricks - FIRE ACCIDENT AT CEMENT BRICKS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2024, 3:12 PM IST
Fire Accident at Cement Bricks Manufacturing Industry : అనకాపల్లి జిల్లాలోని ఓ ఇటుకల తయారీ పరిశ్రమలో చోటు చేసుకున్న పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే, యలమంచిలి మండలం కొత్తూరు సమీపంలో ఉన్న ఓ సిమెంట్ ఇటుకల తయారీ ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో గది మెుత్తం గ్యాస్ తో నిండిపోయింది. వాసన పసిగట్టిన అక్కడి కార్మికులు గదిలోకి వెళ్లి లైట్ వేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మొదట యలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో అక్కడి స్థానికులు భయందోళనకు గురయ్యారు. ప్రమాదంలో వంటగది పైకప్పు కూలిపోగా, గదిలోని వస్తులన్నీ చెల్లచెదురుగా ఎగిరి పడ్డాయి. గాయపడిన బాధితులు లోకనాథ్, కృష్ణారెడ్డి, కేశవరావుగా పోలీసులు తెలిపారు. వీరంతా ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.