ETV Bharat / snippets

మల్కాజిగిరి ఉప్పర్​గూడ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు - యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 7:00 PM IST

Goods Train Derails in Telangana
Goods Train Derails (ETV Bharat)

Goods Train Derails At Medchal Malkajgiri District : మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్​గూడ వద్ద ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్​నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో, 4 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్​లకు మరమ్మతులు చేపట్టారు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకొని, ఘటనా స్థలం వద్దకు ఎవరినీ రానివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ వారం రోజుల వ్యవధిలో రైలు పట్టాలు తప్పిన ప్రమాదం ఇది రెండోది కావటం ప్రయాణికుల్లో భయాందోళనలకు గురి చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.