ETV Bharat / snippets

అన్నారం బ్యారేజీలో మొదలైన జియో ఫిజికల్​ పరీక్షలు - త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక

Geophysical Tests in Annaram Barrage
Geophysical Tests in Annaram Barrage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 7:07 AM IST

Geophysical Tests in Annaram Barrage : ఎన్డీఎస్​ఏ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద నీటి పరిశోధన బృందం జియో ఫిజికల్​ పరీక్షలను ప్రారంభించింది. పుణేకు చెందిన శాస్త్రవేత్త ధనుంజయ నాయుడు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ డిప్యూటీ సీఈ నాగలక్ష్మి, ఈఈ శ్రీలత, డిప్యూటీ ఈఈ సతీశ్​ కుమార్​ సమక్షంలో పలు పరీక్షలను నిర్వహించారు.

సీపేజీలు ఏర్పడిన ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. తొలుత అత్యాధునికమైన జియో రాడర్​ పరికరంతో 34వ వెంట్​ వద్ద పరీక్ష చేశారు. రాడర్​ పరికరాన్ని ఆ ప్రాంతంలో తిప్పుతూ స్కానింగ్​ చేశారు. మరో రకమైన పార్టర్​ సెస్మిక్​ వేచ్​ పద్ధతి ద్వారా బోర్వెల్​ రంధ్రం నుంచి సుమారు 25 మీటర్ల కేబుల్​ తీగను లోపలి భాగంలోకి పంపుతూ పరీక్షలు చేశారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.