ETV Bharat / snippets

100కు 550 - డ్రంక్​ అండ్​ డ్రైవ్‌లో రికార్డు సృష్టించిన మందుబాబులు

DRUNKEN DRIVE CASE
DRUNKEN DRIVE CASE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 12:18 PM IST

Drunken drive Test : హైదరాబాద్​ నగరంలో శనివారం రాత్రి నలుగురు మందుబాబులు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వారిని బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా, ఫలితాలు చూసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. రక్తంలో మద్యం మోతాదు(బీఏసీ) శాతం 550ఎంజీ/100ఎంఎల్‌గా వచ్చింది. మాములుగా అయితే 300 దాటితేనే ఎక్కువగా భావిస్తారు. ఈ నలుగురికి ఏకంగా 550/100 రావడం చూసి ఆశ్చర్యపోయారు.

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా డ్రంకన్‌ డ్రైవ్‌లు నిర్వహించి, 385 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌పై ఎక్కువ దృష్టిసారించారు. ఇక్కడే 182 మంది అడ్డంగా దొరికిపోయారు. పబ్బులు, క్లబ్బులు ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని 17 ప్రధాన మార్గాల్లో వాహనదారులు తప్పించుకోలేని విధంగా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.