ETV Bharat / snippets

హైదరాబాద్​లోని పబ్బులలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - అనుమానితులపై స్పాట్​ డ్రగ్​ టెస్టింగ్​

Excise Police Raid in Hyderabad Pubs
Excise Police Raid in Hyderabad Pubs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 11:17 AM IST

Excise Police Raid in Hyderabad Pubs : ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 10గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు హైదరాబాద్​లోని 12పబ్​లల్లో పోలీసులు తనిఖీలు చేట్టారు. ఈ తనిఖీల్లో 12 బృందాలు పాల్గొని హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో సోదాలు నిర్వహించాయి. అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్టింగ్​ చేశారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్​లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయని అధికారులు తెలిపారు. పబ్ సిబ్బంది ఎవరైన డ్రగ్స్​ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్​లో పబ్స్​పై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ సంబంధిత నేరాలపై సమాచారం ఇవ్వాలంటే 8712659638 నంబర్​కు సమాచారం అందించాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.