Excise Department Operation Dhoolpet : 'ఆపరేషన్ దూల్పేట్' పేరుతో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది ప్రత్యేక బృందాలతో సోదాలు చేశారు. గత 46 రోజులుగా దూల్పేటలో ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 70కి పైగా కేసులు నమోదు చేసి 743 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 70 మందికి పైగా నిందితులను జైల్లోకి పంపించారు. మరో 60 మందికి పైగా పరారీలో ఉన్నారని తెలియజేశారు. టక్కర్ వాడి, జిమ్సి చౌరాయి, జుమ్మా రాజ్ బజార్, గంగా మౌళి, లోయర్ దూల్పేట్, అప్పర్ ప్రాంతాల్లో గంజాయి కోసం ఇంటింటా సోదాలు నిర్వహించారు. దూల్పేట్ తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, అడీషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తుల శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.
'ఆపరేషన్ దూల్పేట్' - 743 కిలోల గంజాయి స్వాధీనం
Published : Sep 21, 2024, 10:47 PM IST