Dhyanchandra Took Charge as Vijayawada Municipal Commissioner: విజయవాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా హెచ్.ఎం ధ్యానచంద్ర బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ధ్యానచంద్ర ప్రజల సంతృప్తే ప్రధానంగా, ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా వీఎంసీ పని చేస్తుందన్నారు. నగరంలోని 64 వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. సైడ్ డ్రైన్లలోని త్రాగునీటి పైప్ లైన్లో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటిలో పాటు నగరాన్ని పచ్చదనంలో అగ్రస్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. నగర ప్రజల ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.
విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ధ్యానచంద్ర బాధ్యతలు స్వీకరణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 7:41 PM IST