ETV Bharat / snippets

ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయండి : భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 6:54 PM IST

MINISTER PONGULETI ON LRS
Deputy CM Bhatti on LRS (ETV Bharat)

Deputy CM Bhatti on LRS : లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం - (ఎల్ఆర్ఎస్) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్​పై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించిన భట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పక్కాగా అమ‌లు చేయాలని స్పష్టం చేశారు.

ఎల్ఆర్ఎస్ విధివిధానాల‌పై సమీక్షించిన మంత్రులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 39 లక్షల ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని నిర్దేశించారు. జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డిప్యుటేషన్ తీసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.