ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్‌కు సంయుక్తంగా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగ రావు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి రూ. 3 లక్షల 72 వేలు 45 రోజుల్లోగా ెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?
2022 జులై 31 వ తేదీన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్ సేవలను శ్రీరంగ రావు వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఆయన బ్యాగ్ మిస్ అవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ ఎట్టకేలకు ఇండిగో, ఖతార్ ఎయిర్ లైన్స్‌కు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.