Visakha MLC Election : ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో విశాఖ జిల్లా నేతలతో సీఎం సమావేశమయ్యారు. కూటమి తరఫున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించగా ఇవాళ్టి భేటీలో విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ నెల 14న స్క్రూటినీ, ఆగస్టు 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించి విజేతను వెల్లడించనున్నారు.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చంద్రబాబు కసరత్తు- అభ్యర్థిని ప్రకటించే చాన్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 3:09 PM IST