Police case Registered on MLA Danam : గురుబ్రహ్మనగర్ స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ నెల పదో తేదీన నందగిరి హిల్స్ పరిధిలోని గురుబ్రహ్మనగర్లోని ప్రభుత్వ స్థలానికి అధికారులు ప్రహరీ కడుతుండగా, అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు అడ్డుకున్నారు. వారందరూ ఎమ్మెల్యే దానంకు ఫిర్యాదు చేయడంతో, ఆ ప్రహరీని ఎమ్మెల్యే తొలగించారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇంచార్జ్ వి. పాపయ్య, ఎమ్మెల్యే దానంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ,10 లక్షల వ్యయంతో ప్రహరిగోడ నిర్మించి ప్రభుత్వస్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే, ఎమ్మెల్యే సమక్షంలోనే కొందరు ప్రహరీని ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతోపాటు వారిలో గోపాల్ నాయక్, రాంచందర్ ఉన్నారని పేర్కొన్నారు.
ప్రహరీ గోడ కూల్చివేత వివాదం - ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
Published : Aug 12, 2024, 9:45 PM IST