Case Filed on Kadapa mayor Suresh Babu : కడప నగర మేయర్ సురేష్ బాబుతో పాటు 15 మందిపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. కడప నగరంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య గత కొంతకాలం నుంచి చెత్త సేకరణపై విషయమై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ వర్గానికి చెందిన కొంతమంది కార్యకర్తలు మేయర్ ఇంటి ఎదుటకు వెళ్లి ఆందోళన చేసి ఆయన ఇంట్లోకి చెత్తను విసిరారు. విషయం తెలుసుకున్న మేయర్ వర్గీయులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో మేయర్ సహా మరో 15 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
కడప మేయర్ సురేష్‌బాబుపై కేసు నమోదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 10:03 AM IST