ETV Bharat / snippets

సూపర్​ 6 పథకాల నుంచి తప్పించుకునేందుకే సీఎం శ్వేతపత్రం: బుగ్గన రాజేంద్రనాథ్

buggana_on_chandrababu
buggana_on_chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 3:06 PM IST

Buggana Rajendranath Allegations on CM Chandrababu: సూపర్​ 6 పథకాల నుంచి తప్పించుకునేందుకే సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. బాబు విడుదల చేసింది సాకుపత్రం అని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని బుగ్గన అన్నారు. చంద్రబాబు చేసిన అప్పులతో పోలిస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం తక్కువేనని ఆయన సర్దిచెప్పుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే 9వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని దీని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులపైనే చర్చ పెట్టి, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని బుగ్గన అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.