BRS Photo Exhibition on Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగభవన్‌లో ఉద్యమయాది పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను జూన్ రెండో తేదీన నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలతో పాటు కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను ఇందులో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఎవరిదగ్గరైనా ఫొటోలు ఉంటే పంపాలని బీఆర్ఎస్ కోరింది. 14 ఏళ్ల పోరాటంలో కేసీఆర్‌కు సంబంధించిన, ఆయా ప్రాంతాల్లో జరిగిన ఉద్యమ సంఘటనలకు చెందిన చిత్రాలు ఉంటే 9011966666 నంబర్‌కు పంపాలని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ తెలిపారు. వాటిని జూన్ రెండో తేదీన ప్రదర్శనలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమయాదిలో - జూన్ 2న బీఆర్ఎస్ ఫొటో ఎగ్జిబిషన్
Published : May 31, 2024, 2:39 PM IST