ETV Bharat / snippets

మహబూబాబాద్​ జిల్లాలో విషాదం - హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య

Boy Suicide in Mahabubabad
Child Suicide (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 10:02 AM IST

Boy Suicide in Mahabubabad Due To Hair Cut : తండ్రి తనకు చేయించిన హెయిర్ స్టైల్ నచ్చలేదంటూ ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ సీతానాగారం హాస్టల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్నాడు.

నాలుగు రోజుల క్రితం హర్షవర్ధన్​ను తన తండ్రి ఓ కటింగ్ షాప్​నకు తీసుకెళ్లి కటింగ్ చేయించాడు. అయితే ఆ హెయిర్ స్టైల్ తనకు ఇష్టం లేదని హర్ష తండ్రితో గొడవ పడ్డాడు. అనంతరం తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా హర్షవర్ధన్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ హర్ష గురువారం ఉదయం మృతి చెందాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.