ETV Bharat / snippets

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ - రాష్ట్రంలో వరదల పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన బండి సంజయ్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 4:39 PM IST

BANDI SANJAY BRIEF AMITSHAH ON RAIN
Telangana Rains 2024 (ETV Bharat)

Telangana Rains 2024 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్రమంత్రి బండి సంజయ్, కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ను కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్‌, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను రాష్ట్రానికి పంపించారు.

కేంద్రం ఆదేశాలతో ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతో పాటు పట్టణంలోని ప్రకాశ్‌నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తాండ గుట్టపై 68 మంది లోతట్టు ప్రాంతాల్లో భవనాలపై 42 మంది చిక్కుకున్నారని బండి సంజయ్‌ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.