ETV Bharat / snippets

వరద బాధితులకు భారీ విరాళం - రూ. 7.70 కోట్లు ప్రకటించిన ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 7:12 PM IST

AP Panchayat Raj Chamber
AP Panchayat Raj Chamber (ETV Bharat)

AP Panchayat Raj Chamber President Donates : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ రూ. 7 కోట్ల 70 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో విజయవాడ నగరం పుర్తిగా వరద ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు మానవత దృక్పథంతో తోడుగా నిలవాలని సమావేశంలో తీర్మానించిందని తెలిపారు. అందులో భాగంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల వేతనం రూ. 7 కోట్ల 70 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అంగీకర తీర్మాన పత్రాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.