AP Government Refurbished Spandana Program : ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందనను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిగా మార్చాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయం పడింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ"గా కొనసాగించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు.
స్పందన కార్యక్రమం ప్రక్షాళన - 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ'గా మార్పు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 10:07 AM IST