Supreme Court Dismissed Johnny Master Bail Cancellation Petition : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబరు 24న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో సినిమా అరెస్టయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 24న జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని, ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది.
లైంగిక వేధింపుల ఆరోపణల కేసు - బెయిల్‌పై జానీ మాస్టర్ విడుదల
మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు. షూటింగ్ సమయంలోనూ మేకప్ వ్యాన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వివరించారు. తాను నిరాకరిస్తే మేకప్ వ్యాన్‌లో ఉన్న అద్దానికేసి తలను బాదినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు.
జానీ మాస్టర్‌కు మరో షాక్ - జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత - jani master national award revoked