ETV Bharat / snippets

వర్షాలతో కూలిన పెంకుటిల్లు - భార్య మృతి, మరో గదిలో నిద్రించిన భర్త సేఫ్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 12:21 PM IST

Old Woman Died after Collapsing House
Old Woman Died after Collapsing House (ETV Bharat)

Old Woman Died after Collapsing House : రాత్రి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెంకుటిల్లు కూలడంతో శంకరమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్​ జిల్లా టేక్మాల్​ మండల కేంద్రంలో జరిగింది. ఇల్లు కూలిన సమయంలో భర్త వేరే గదిలో నిద్రించడంతో అతనికి ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇటీవల భారీ వర్షాలు కురవడంతోనే పెంకుటిల్లు నాని కూలిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.