Husband Killed Wife in Vishaka Dist : విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పద్మనాభంలో జరిగింది. భూలోకం, లక్ష్మి దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శుక్రవారం రాత్రి లక్ష్మి ఫోన్లో ఇతరులతో మాట్లాడటం అతను గమనించాడు. ఈ విషయంమై ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Husband Killed Wife in Padmanabham : దీంతో భూలోకం క్షణికావేశంలో లక్ష్మిని హతమార్చాడు. దీనిపై స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.