Social Media Comments On Sithakka: మంత్రి సీతక్కతో పాటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా దూషించిన వ్యక్తిపై సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు బీఎన్ఎస్ఎస్ 173, 176 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలను సామాజిక మాధ్యమాల్లో కావాలని టార్గెట్ చేసి దూషించడం పట్ల పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి దూషణలకు దిగడం సరికాదని దినేశ్ కుమార్ అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.