ETV Bharat / snippets

ఆసియా కప్​లో నేపాల్ శుభారంభం- UAEపై గ్రాండ్ విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 7:09 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

UAE W vs NEP W: 2024 మహిళల ఆసియా కప్​లో నేపాల్ జట్టు శుభారంభం చేసింది. యూఏఈతో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో నేపాల్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20ఓవర్లకు 115 పరుగులు చేసింది. కుషీ శర్మ (36 పరుగులు) టాప్ స్కోరర్. నేపాల్ కెప్టెన్, బౌలర్ ఇందు బర్మ 3 వికెట్లు దక్కించుకుంది.

అనంతరం 116 పరుగుల ఛేదనలో నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ సమ్జానా ఖడ (72* పరుగులు, 45 బంతుల్లో) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మరో ఎండ్​లో వికెట్లు పడుతున్నా బెదరకుండా జట్టును లక్ష్యం దిశగా నడిపించి విజయం కట్టబెట్టింది. ఇక యూఏఈ బౌలర్లలో కవీషా 3 వికెట్లు పడగొట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.