ETV Bharat / snippets

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా- పాక్​ను దెబ్బకొట్టింది 'బుమ్రా'నే

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 2:22 PM IST

Bumrah vs Pakistan
Bumrah vs Pakistan (Source: Associated Press)

Bumrah vs Pakistan: 2024 వరల్డ్​కప్​లో పాకిస్థాన్​పై అసాధ్యమైన విజయాన్ని టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సుసాధ్యం చేశాడు. ఈ మ్యాచ్​లో పాకిస్థాన్ చేతుల్లో ఉన్న గేమ్​ను బుమ్రా లాగేశాడు. కీలక వికెట్లు నేలకూల్చి పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్​లో భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. నాలుగు ఓవర్ల కోటాలో (3/14) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి 'మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్'​గా ఎంపికయ్యాడు.

అయితే ఈ మ్యాచ్​లోనే కాకుండా గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​లోనూ బుమ్రా, పాకిస్థాన్​ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఆ మ్యాచ్​లో డేంజరస్ మహ్మద్ రిజ్వాన్​, షాదాబ్ ఖాన్​ను పెలివియన్ చేర్చాడు. 7 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఇందులో 1 మెయిడెన్ ఉంది. దీంతో ఆ మ్యాచ్​లోనూ మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ బుమ్రాకే దక్కింది. ఇలా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో పాక్​ను బుమ్రానే తీవ్రంగా దెబ్బకొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.