Rafael Nadal wimbledon : ఫిట్‌నెస్ లేకుండా ఫ్రెంచ్ఓపెన్లో దిగి మొదటి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్ దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ ఇప్పుడు వింబుల్డన్ నుంచి వైదొలిగాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని చెప్పాడు. ఒలింపిక్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలిపాడు. కాగా, 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన నాదల్ జులై 26న పారిస్‌లో ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో బరిలో దిగననున్నాడు. డబుల్స్‌లో కార్లోస్ అల్కరాస్‌తో కలిసి ఆడనున్నాడు.
భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ - టెన్నిస్‌లో వింబుల్డన్ ప్రతిష్టాత్మక టోర్నీ. ఇప్పుడు దీని ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఇకపై రూ.533 కోట్లు ప్రైజ్‌మనీ కేటాయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. గత టోర్నీతో పోలిస్తే ఈ మొత్తం 11.9 శాతం ఎక్కువ. విజేతకు ట్రోఫీతో పాటు రూ.28 కోట్లు, రన్నరప్‌కు రూ.14 కోట్లు దక్కుతాయి. సింగిల్స్‌లో మొదటి రౌండ్లో ఓడిన ప్లేయర్లకు రూ.64 లక్షల చొప్పున ఇస్తారు.